కామారెడ్డి, 04 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా గురువారం గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ను ఎన్నికల నియమ నిబంధన లు, నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుము దిని అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఎన్నిక ల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుము దిని అన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణ ఎన్నికల కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడు తూ, 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాల ని, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాల ని తెలిపారు. 3వ విడతలో నిర్వహించే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన, ఫారా లు జారీ చేయాలని, ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షం గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, ఫారం 14, 20 వినియో గం పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నామి నేషన్ల ప్రక్రియలో నెలకొన్న సమస్యలు, అందిన ఫిర్యాదుల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసు కోవాలని సూచించారు. నివేదికలు, టి – పోల్ ఎంట్రీలు, రికార్డులు, మిస్ మ్యాచ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ర్యాండమైజే షన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, స్టేజ్ 2 ఆర్. ఓ. ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని ,సర్పంచ్ స్థానాల ఎన్ని క మొదటి విడతలో (11 ) స్థానాలు ఏకగ్రీవం ,(156 ) స్థానాలలో పోలింగ్ నిర్వహించడం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ మదన్ మోహన్ , పంచాయ తీ అధికారి మురళీ, ఆర్డీఓ వీణ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందర్, సంబంధి త అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


