Wednesday, 30 July 2025
  • Home  
  • ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయం
- Featured

ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయం

28-05-2020 (పున్నమి ప్రతినిధి) విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయమని చెప్పవచ్చు. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రజల మన్ననలు పొందారు. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఎన్టీఆర్.. ఈ పేరు ఒక ప్రభంజనం, ఒక చరిత్ర, భావితరాలకు ఆదర్శం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగు ఉన్నంత కాలం, తెలుగు వెలుగుతూ ఉన్నంత కాలం శాశ్వతం.సినీ జగత్తులో నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు. ఎన్టీఆర్‌గా, అన్నగా తెలుగు జాతి హృదయాలను గెలుచుకున్న విశ్వనటుడు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. తెలుగు భాషా నుడి కారాలకు పర్యాయపదం. ఆత్మగౌరవ పతాక. మరోవైపు ఎన్టీఆర్‌ అంటే క్రమశిక్షణ. తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. నాలుగు దశాబ్దాల పైబడిన సినీ ప్రస్థానంలో నాలుగు వందలకు పైబడి నటించిన చిత్రాల్లో తెలుగువారి జీవన నేపథ్యమే ప్రతిఫలించింది. పురాణ పాత్రల ద్వారా ఆరాధ్యదైవంగా నిలి చారు. మనుబోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 97 జయంతిని పురస్కరించుకొని మనుబోలు,యాచవరం గ్రామంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి ,వైద్య సిబ్బందికి ఓ. .ఆర్. ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి ,కలికి రమేష్ రెడ్డి ,సాని వెంకటరమణయ్య,దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజా గౌడ్ ,రావుల అంకయ్య గౌడ్, చేరెడ్డి పద్మనాభ రెడ్డి ,చల్ల గిరి ప్రసాద్ ,శ్రీనివాసులు రెడ్డి ,చింతల వెంకటేశ్వర్లు, గుంజి రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

28-05-2020 (పున్నమి ప్రతినిధి) విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయమని చెప్పవచ్చు. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రజల మన్ననలు పొందారు.
1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు.
ఎన్టీఆర్.. ఈ పేరు ఒక ప్రభంజనం, ఒక చరిత్ర, భావితరాలకు ఆదర్శం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగు ఉన్నంత కాలం, తెలుగు వెలుగుతూ ఉన్నంత కాలం శాశ్వతం.సినీ జగత్తులో నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు. ఎన్టీఆర్‌గా, అన్నగా తెలుగు జాతి హృదయాలను గెలుచుకున్న విశ్వనటుడు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. తెలుగు భాషా నుడి కారాలకు పర్యాయపదం. ఆత్మగౌరవ పతాక. మరోవైపు ఎన్టీఆర్‌ అంటే క్రమశిక్షణ. తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. నాలుగు దశాబ్దాల పైబడిన సినీ ప్రస్థానంలో నాలుగు వందలకు పైబడి నటించిన చిత్రాల్లో తెలుగువారి జీవన నేపథ్యమే ప్రతిఫలించింది. పురాణ పాత్రల ద్వారా ఆరాధ్యదైవంగా నిలి చారు. మనుబోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 97 జయంతిని పురస్కరించుకొని మనుబోలు,యాచవరం గ్రామంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి ,వైద్య సిబ్బందికి ఓ. .ఆర్. ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి ,కలికి రమేష్ రెడ్డి ,సాని వెంకటరమణయ్య,దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజా గౌడ్ ,రావుల అంకయ్య గౌడ్, చేరెడ్డి పద్మనాభ రెడ్డి ,చల్ల గిరి ప్రసాద్ ,శ్రీనివాసులు రెడ్డి ,చింతల వెంకటేశ్వర్లు, గుంజి రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.