ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన నగర మేయర్
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లతోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన 8వ జోన్ 98 వార్డు పరిధిలో అప్పన్నపాలెం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పించను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు దారిద్యరేఖకు దిగువున ఉన్న వారికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు చంద్రబాబు అండగా ఉంటూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతినెల 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందిస్తున్నారని తెలిపారు. 98వ వార్డులో అప్పన్నపాలెం లోని పలువురికి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను అందించడం జరిగిందని తెలిపారు. సామాజిక పింఛన్ల పెంపు అనేది తెలుగుదేశం ప్రభుత్వం తోనే సాధ్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని మేయర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో 8వ జోన్ జోన్ల కమిషనర్ హెచ్ విజయ శంకర్, వార్డ్ కార్పొరేటర్ పీ.వీ. నరసింహం, జివిఎంసి ఏపిడి చిరంజీవి, వార్డ్ సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


