ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో NH-65 రహదారిపై మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో ఒక మహావృక్షం అకస్మాత్తుగా రోడ్డుపైన కూలిపోయింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన నందిగామ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీఓ, కీసర టోల్ ప్లాజా సిబ్బంది, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు కలిసి సమన్వయం తో చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు వెంటనే రహదారి శుభ్రపరిచే పనులు చేపట్టి, కొద్ది సేపటికే ట్రాఫిక్‌ను సాఫీగా కొనసాగిం చారు. ప్రస్తుతం రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు నిరాటంకం గా సాగుతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో NH-65 రహదారిపై మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో ఒక మహావృక్షం అకస్మాత్తుగా రోడ్డుపైన కూలిపోయింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన నందిగామ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీఓ, కీసర టోల్ ప్లాజా సిబ్బంది, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు కలిసి సమన్వయం తో చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు వెంటనే రహదారి శుభ్రపరిచే పనులు చేపట్టి, కొద్ది సేపటికే ట్రాఫిక్‌ను సాఫీగా కొనసాగిం చారు. ప్రస్తుతం రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు నిరాటంకం గా సాగుతున్నాయి.

