ఎన్టీఆర్ జిల్లాను మొంథా తుఫాన్ వణికిస్తోంది….
తుఫాన్ ప్రభావంతో తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి…
తిరువూరులో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆర్టీసీ బస్టాండ్ మరియు ప్రధాన రహదారి నీట మునిగాయి…
పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి…
మొంథా తుఫాన్ దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది..
అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

