శ్రీకాకుళం జిల్లా , నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
ఆదిత్య జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరాలు ఉమాగిరి, పితా తోలి, కాలనీ లో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరాల్లో భాగంగా ఆరవ రోజు వెటర్నరీ సర్జన్ మందస డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు గ్రామంలో ఉన్న రైతులకు పాడి పరిశ్రమ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని దానికి ప్రభుత్వం తోడ్పాటు వివిధ రకాల స్కీముల్ ద్వారా అందిస్తుందని అలాగే పశువుల్లో వచ్చేటటు వంటి దీర్ఘకాలిక రోగాలకు ఏ రకంగా మందులు వేసుకోవాలి విషయంపై రైతులకు అవగాహన కల్పించారు
. పితాతోలి , కాలనీ గ్రామంలో బహిరంగ మలవిసర్జన అనేది నేరమని, సుకన్య సమృద్ధి యోజన , పెరటి తోటలు పంపకం అందులో ఉన్న మెలకువలు గురించి, తదితరాంశాలపై గ్రామస్తులకు చైతన్యం కలగజేసిన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పీవోలు మన్మధరావు, రవిశంకర్, కృష్ణారావు అధ్యాపకులు కళాశాల ప్రిన్సిపాల్ దొంగ ప్రవీణ్, మార్పు హరికృష్ణ ప్రసాద్ వాలంటీర్లు పాల్గొన్నారు


