🔸ఎడమ తిరుపతయ్య గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
సీతారామపురం మండలం బెస్త కాలనీలో హెడ్మాస్టర్గా సేవలందించిన ఎడమ తిరుపతయ్య పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై తిరుపతయ్య ని శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, తిరుపతయ్య ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా ఆదర్శవంతమైన గురువుగా ఎన్నో తరాల విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశారని కొనియాడారు. పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, నైతిక విలువల బోధనలో ఆయన చూపిన అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
తదుపరి, తిరుపతయ్య గారికి పదవీ విరమణ అనంతర జీవితం ఆనందంగా, ఆరోగ్యంతో, కుటుంబ సభ్యుల మధ్య సుఖశాంతులతో గడవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా సమాజానికి మార్గదర్శకత్వం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



