అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి
కాకివాయిలో 100 ఎకరాలు నీట మునిగిన వరి పంట
అన్నదాతను ఆదుకోండి అంటూ రైతులు ఆవేదన
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో గడిచిన ఐదు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ఆ గ్రామంలో సుమారు 100 ఎకరాలు వరి పంట నీట మునిగింది.వరి పంట నీటమునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికి వచ్చిన పంట ఇంటికి చేరే సమయానికి కురుస్తున్న వర్షాలు ఇంకా అధికమవు తుండడంతో పంట మొత్తం నేలపాలైయింది.తిరిగి గింజలు నీటిలో మొలకెత్తుతున్నాయని అన్నారు.తమ పంట మొత్తం నేలపాలయ్యిందని మమ్ములను ఆదుకోవాలంటూ తమ బాధను ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా కన్నీరు మున్నీరుగా రైతులు విలపిస్తున్నారు.ఉన్నతాధికారులు తక్షణమే నీట మునిగిన మా పంటలను పరిశీలించి పంట నష్టం కింద ప్రభుత్వం ఆర్థిక భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను వారు వేడుకుంటున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిసేలా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించాలని కాకివాయి గ్రామ రైతులు అభ్యర్థిస్తున్నారు.


