బంటుమిల్లి మండలం మల్లంపూడి హైస్కూలు కి డ్రైనేజీ మార్గం లేక స్కూలు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చాలా అవస్థలు పడేవారు. వర్షం పడితే స్కూలు ఆవరణ అంతా మోకాళ్ళ లోతు నిండిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేవారు.పాఠశాల పరిసర ప్రాంతం వాళ్లు మురుగు నీరు వెళ్లే మార్గాన్ని ఆక్రమించి మట్టితో పూడ్చి వేయడం వల్ల, మురుగునీరు వెళ్లే మార్గం లేక విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా అవస్థలు పడేవారు.
ఇటీవల గ్రామ పెద్దలు డ్రైనేజీ తవ్వుటకు ప్రయత్నించగా ఆ పరిసర ప్రాంత ఇంటి యజమానులు అడ్డుకొని అభ్యంతరం చెప్పడంతో స్కూలు హెచ్ఎం, పంచాయతీ అధికారులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, మరియు పంచాయతీ అధికారులు రంగంలోకి దిగి డ్రైనేజీ ప్రాంతాన్ని గుర్తించి, డ్రైనేజీని తవ్వించడం తో స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

