పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం హైడ్రా తేవడం వల్ల హస్తినాపురం డివిజన్ పరిధిలో గల హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో సుమారు 100 కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడినట్లు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు. గత 30 సంవత్సరాల క్రితం నాడు ప్లాట్లు చేసిన సమయంలో పార్కు కోసం కేటాయిం 1. ఎకరా 27 గుంటల భూమిని భూ యజమానులు మాది అని కోర్టుకు వెళ్లగా అట్టి స్థలాన్ని హైడ్రాధికారులు పరిశీలించి మంగళవారం ఒక ఎకరా 27 గుంటల భూమి చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నట్లు తెలిపారు. స్థలాన్ని కార్పొరేటర్ గారు వెళ్లి పరిశీలించి హర్షంవ్యక్తం చేసినట్లు తెలిపారు. త్వరలో అట్టి స్థలంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తేవడం వల్ల ప్రతిపక్ష నాయకులు చేసిన కుట్రలు కుతంత్రాలను బట్టబయలు చేసి ప్రభుత్వ భూములను కాపాడుతున్నట్లు తెలిపారు. 100 కోట్ల రూపాయల విలువగల భూమిని స్వాధీనం చేసుకోవడం ఈ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మధుయాష్ కి గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పార్కు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి యాదయ్య గౌడ్ కొండల్ రెడ్డి బాలాజీ శ్రీనివాస్ గౌడ్ రామ్ చందర్ స్థానిక కాంగ్రెస్ నాయకులు డేరంగుల కృష్ణ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఎకరా 27 గుంటల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించిన హైడ్రా అధికారులు

1 Comment
S . DHANUNJAY
November 2, 2025very good