*విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి*
*ఎం.వి.పి క్రైమ్ మరియు లా & ఆర్డర్ పోలీసు స్టేషన్ లను సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు*
*నగరంలో లా & ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నందు సిపి గారు రెండవ విడత ఇన్ స్పెక్షన్ చేపట్టడం జరుగుతుంది*, రెండవ విడత ఇన్స్పెక్షన్ లో భాగముగా సిపి గారు ఈ రోజు రాత్రి ఎం.వి.పి క్రైమ్ మరియు లా & ఆర్డర్ పోలీసు స్టేషన్ల నందు ఇన్ స్పెక్షన్ నిర్వహించారు.
పోలీసు స్టేషన్ పరిసరాలను సందర్శించిన సీపీ గారు అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు, స్టేషన్ రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది.
సదరు ఇన్స్పెక్షన్ నందు క్రైమ్ అధికారులు, స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది హాజరు కావడం జరిగినది.


