Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

ఎం.ఎం. కుంటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Punnami Newsroom Published: Updated:
ఎం.ఎం. కుంటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ
తుర్కయంజాల్: ఎం.ఎం. కుంట గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ 56వ డివిజన్‌ లో బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఈ పండుగను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిటీ సభ్యులు అన్నారు. బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు ప్రకృతిపై ప్రేమను, పూల ప్రాముఖ్యతను చాటిచెబుతుందని తెలిపారు.తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ, మన సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి పండుగలను ఐకమత్యంతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నిర్వాహకులు: బండారి సంజీవ వంశరాజ్ ఉపాధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా సంచార జాతుల సంఘం

ఎం.ఎం. కుంటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఎం.ఎం. కుంటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *