దుత్తలూరు
Date :13-1-2026
దుత్తలూరు మండలం రెడ్లదిన్నె పంచాయతీ లొ
ఎంపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరo
పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా స్థానిక పార్లమెంట్ సభ్యులువేమిరెడ్డి ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈరోజు రెడ్లదిన్నె గ్రామం లొ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ప్రముఖ కంటి ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించారు.
పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను, మందులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ దుత్తలూరు మండలం కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి గారు,తెలుగుదేశం కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తమ గ్రామానికి వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించినందుకు స్థానికులు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.


