శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామ సచివాలయంలో హిందుస్థాన్ కోకా కోలా బెవరేజస్, వై ఫోర్ డి ఫౌండేషన్ సహకారంతో స్థానిక ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట శ్రీ వెంకటేశ్వర క్లినిక్ అధినేత డాక్టర్ తేనేపల్లి జనార్ధన్ హాజరై మాట్లాడారు. ప్రస్తుత కాలంలో కార్పొరేట్ ఆసుపత్రులు వ్యాపార దృక్పథంతో నడుస్తున్నాయని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన వైద్యుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్ధాల రవిబాబు మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న కోకా కోలా కంపెనీ, వై ఫోర్ డి ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫీజులు చెల్లించలేని అనేక మంది పేదలకు ఉచితంగా పరీక్షలు, మందులు అందించడం గొప్ప సేవ అని అభినందించారు. వై ఫోర్ డి ఫౌండేషన్ ప్రతినిధి ఖలీల్ మాట్లాడుతూ, సంస్థ పరిసర గ్రామాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆరోగ్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ శిబిరంలో వివిధ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఊరందూరులో ఉచిత వైద్య శిబిరం… గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి సేవలు