రాజంపేట పట్టణం తిరుపతి రోడ్డులోని S.R కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం ఘనంగా వివాహ రిసెప్షన్ జరిగింది. రాజంపేట పట్టణం ఉస్మాన్‌నగర్ వాసులు, టీడీపీ నేత, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి నరసింహ (రాంనగర్ నరసింహ) సోదరీమణి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బత్యాల చంగల్‌రాయుడు హాజరై నూతన వధూవరులు అనిత-హరీష్ దంపతులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.


