Friday, 13 March 2026
  • Home  
  • ఊటుకూరులో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: భోగినేని కాశీరావు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఊటుకూరులో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: భోగినేని కాశీరావు

ఊటుకూరులో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: భోగినేని కాశీరావు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు శ్రీ గవ్వల వెంకయ్య గారి ఆధ్వర్యంలో, “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు శ్రీ భోగినేని కాశీరావు గారి అధ్యక్షతన విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భోగినేని కాశీరావు మాట్లాడుతూ, జీవితంలో పదవ తరగతి ఎంతో కీలకమైన దశ అని పేర్కొన్నారు. సమాజంలో గౌరవం పొందడానికి మరియు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటే తమ కుటుంబంతో పాటు సమాజానికి కూడా సేవ చేయగలమని విద్యార్థులకు సూచించారు. మన దేశంలో ఎంతో మంది మహనీయులు పేదరికంలో జన్మించినప్పటికీ ఉన్నత విద్యతో దేశ అభివృద్ధికి సేవలందించారని గుర్తుచేశారు. అదే విధంగా విద్యార్థులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి భవిష్యత్తుకు పునాది వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి గారు, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు భోగినేని కాశీరావు, గవ్వల వెంకయ్య, నీలిరత్నయ్య, రామమూర్తి, వెలుగోటి సురేష్, బ్యాంక్ మేనేజర్ రవి గారు మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఊటుకూరులో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: భోగినేని కాశీరావు
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు శ్రీ గవ్వల వెంకయ్య గారి ఆధ్వర్యంలో, “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు శ్రీ భోగినేని కాశీరావు గారి అధ్యక్షతన విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భోగినేని కాశీరావు మాట్లాడుతూ, జీవితంలో పదవ తరగతి ఎంతో కీలకమైన దశ అని పేర్కొన్నారు. సమాజంలో గౌరవం పొందడానికి మరియు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటే తమ కుటుంబంతో పాటు సమాజానికి కూడా సేవ చేయగలమని విద్యార్థులకు సూచించారు. మన దేశంలో ఎంతో మంది మహనీయులు పేదరికంలో జన్మించినప్పటికీ ఉన్నత విద్యతో దేశ అభివృద్ధికి సేవలందించారని గుర్తుచేశారు. అదే విధంగా విద్యార్థులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి భవిష్యత్తుకు పునాది వేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి గారు, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు భోగినేని కాశీరావు, గవ్వల వెంకయ్య, నీలిరత్నయ్య, రామమూర్తి, వెలుగోటి సురేష్, బ్యాంక్ మేనేజర్ రవి గారు మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.