Sunday, 7 December 2025
  • Home  
  • ఉల్లిపంట రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తప్పదు క్వింటా ధర 3 వేల తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి
- అన్నమయ్య

ఉల్లిపంట రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తప్పదు క్వింటా ధర 3 వేల తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి

…..కోల్డ్ స్టోరేజ్ లు లేక ప్రతి ఏటా అవస్థలు …..ఈనెల 6న శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన ….గారి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండు ఉల్లి పంట సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర క్వింటాకు 3000 తో ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. గురువారం ఎర్రగుంట్ల మండలం దండుపల్లె వెల్దుర్తి, వీయన్ పల్లి మండలం కొమ్మది, తొండూరు మండలం గంగనపల్లి, చెర్లోపల్లి, ఊడగండ్ల, గంగాదేవి పల్లె గ్రామాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం వి సుబ్బారెడ్డి, వెంకట్ రాముడు, హరిహర నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు పదివేల ఎకరాలలో ఉల్లి పంట సాగు చేసినట్లు ప్రాథమిక అంచనా అన్నారు. ఎకరా పంట సాగుకు కనీసం అంటే విత్తనాలు ఎరువులు పురుగుమందులు కూలీల ఖర్చు వెరసి లక్ష రూపాయలు దాకా వస్తుందన్నారు. ఎకరాకు 60 నుంచి 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ప్రస్తుత మార్కెట్లో క్వింటాదర 800 నుండి వెయ్యి రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని దీని ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు క్వింటా ధర 1200 తో కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి లాభం రాదన్నారు.ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫార్సుల ఆధారంగా కనీసం మద్దతు ధర నిర్ణయించాలన్నారు సేద్యం, విత్తనాలు, ఎరువులు ,పురుగు మందులు ,వ్యవసాయ కూలీలు ,కుటుంబ శ్రమ, వ్యవసాయ మూలధన వ్యయం అన్నింటినీ లెక్కించి వాటి ఆధారంగా 50 శాతం ఆదాయం వచ్చే విధంగా కనీసం మద్దతు ధర నిర్ణయించాలని ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు రైతులకు నష్టం వస్తుందా అన్న అటువంటి ఆలోచన లేకుండా 1200 రూపాయలు కింటాకు కల్పించడం దుర్మార్గమని తక్షణమే ఈ ఆలోచన విరమించుకొని క్వింటాకు 3000 రూపాయలు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కొనుగోలు దారులు తరువు పేరుతో క్వింటాకు 15 కిలోల చొప్పున పరోక్ష దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఏటా ఉల్లి రైతులు నష్టపోతు వచ్చే సంవత్సరమైనా కోరుకుంటామన్న గంపడాశతో అప్పు సప్పుచేసి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, నిలువ చేసుకునే వెసులుబాటులేక చేసిన అప్పులు తీర్చలేక అవమానభారంతో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6న శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన కు ఉల్లి రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు. రైతులు సురేష్, ఈశ్వరయ్య, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, విజయ్, మహేష్, వీరాంజనేయులు, నాగార్జున రెడ్డి, హనుమంతు, రవిశంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివందనములతో., గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.

…..కోల్డ్ స్టోరేజ్ లు లేక ప్రతి ఏటా అవస్థలు

…..ఈనెల 6న శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన

….గారి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండు

ఉల్లి పంట సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర క్వింటాకు 3000 తో ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. గురువారం ఎర్రగుంట్ల మండలం దండుపల్లె వెల్దుర్తి, వీయన్ పల్లి మండలం కొమ్మది, తొండూరు మండలం గంగనపల్లి, చెర్లోపల్లి, ఊడగండ్ల, గంగాదేవి పల్లె గ్రామాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం వి సుబ్బారెడ్డి, వెంకట్ రాముడు, హరిహర నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు పదివేల ఎకరాలలో ఉల్లి పంట సాగు చేసినట్లు ప్రాథమిక అంచనా అన్నారు. ఎకరా పంట సాగుకు కనీసం అంటే విత్తనాలు ఎరువులు పురుగుమందులు కూలీల ఖర్చు వెరసి లక్ష రూపాయలు దాకా వస్తుందన్నారు. ఎకరాకు 60 నుంచి 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ప్రస్తుత మార్కెట్లో క్వింటాదర 800 నుండి వెయ్యి రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని దీని ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు క్వింటా ధర 1200 తో కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి లాభం రాదన్నారు.ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫార్సుల ఆధారంగా కనీసం మద్దతు ధర నిర్ణయించాలన్నారు సేద్యం, విత్తనాలు, ఎరువులు ,పురుగు మందులు ,వ్యవసాయ కూలీలు ,కుటుంబ శ్రమ, వ్యవసాయ మూలధన వ్యయం అన్నింటినీ లెక్కించి వాటి ఆధారంగా 50 శాతం ఆదాయం వచ్చే విధంగా కనీసం మద్దతు ధర నిర్ణయించాలని ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు రైతులకు నష్టం వస్తుందా అన్న అటువంటి ఆలోచన లేకుండా 1200 రూపాయలు కింటాకు కల్పించడం దుర్మార్గమని తక్షణమే ఈ ఆలోచన విరమించుకొని క్వింటాకు 3000 రూపాయలు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కొనుగోలు దారులు తరువు పేరుతో క్వింటాకు 15 కిలోల చొప్పున పరోక్ష దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఏటా ఉల్లి రైతులు నష్టపోతు వచ్చే సంవత్సరమైనా కోరుకుంటామన్న గంపడాశతో అప్పు సప్పుచేసి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, నిలువ చేసుకునే వెసులుబాటులేక చేసిన అప్పులు తీర్చలేక అవమానభారంతో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6న శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన కు ఉల్లి రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
రైతులు సురేష్, ఈశ్వరయ్య, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, విజయ్, మహేష్, వీరాంజనేయులు, నాగార్జున రెడ్డి, హనుమంతు, రవిశంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివందనములతో.,
గాలి చంద్ర
సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.