భారీ వర్షాల కారణంగా చర్ల తిరుమలాపూర్ వెళ్ళే రోడ్డు మీదకు వరద నీరు చేరడంతో గ్రామానికి రాకపోకలు బంద్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మేల్యే గారు స్వయంగా వెళ్ళి పరిశీలించి అందుకు ప్రత్యామ్నాయంగా చర్ల తిరుమలాపూర్ నుంచి చర్ల ఇటిక్యాల మీదుగా నాగర్ కర్నూల్ పట్టణానికి వచ్చే రోడ్డును మరమ్మతులు చేసి గ్రామస్థులకు రోడ్డు సదుపాయం కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఈఈ విజయ్ కుమార్ గారిని ఆదేశించడం జరిగింది. ఇందుకు గాను గ్రామస్థులు ఎమ్మేల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
♦️ఎమ్మేల్యే గారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్ల తిరుమలాపూర్ గ్రామస్థులు సంభధిత అధికారులు ఉన్నారు.


