Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Punnami Newsroom Published:
ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

నాగోల్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను నాగోల్‌లోని తన నివాసంలో అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంటి ఆవరణలో వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతికి మానవుడికి మధ్య ఉన్న అనుబంధానికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో అమ్మవారిని పూజించడం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఉప్పల స్వప్న, కుమారులు ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయి తేజ, కోడలు శర్వారీ పాల్గొన్నారు.

ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *