Thursday, 5 February 2026
  • Home  
  • ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక
- చిత్తూరు

ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక

ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక !)ఆదరించిన స్థలాన్ని మరువం !!)రిటైర్డ్ చిత్తూరు డీవైఈఓ వాసు వృత్తిపరంగా పనిచేసినా ఆదరించిన స్థలాన్ని తాము ఎప్పటికీ మరువమని చిత్తూరు రిటైర్డు డివైఈఓ వాసుదేవ నాయుడు అన్నారు.స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ నందు 1990 – 2000 దశకములో పనిచేసిన ఉపాధ్యాయులు,ఉపన్యాసకులు ఆఫీస్ సిబ్బంది కలసి శనివారం ఆత్మీయ సమావేశం ఆ పాఠశాలలో నిర్వహించు కొన్నారు.అందరం కలసి ఒకరికొకరు యోగక్షేమాలు తెలిసికొని ఆ నాటి తీపిగుర్తులు నెమరు వేసుకొన్నారు.ఇందులో భాగంగా అప్పటి సహచరులు చాలా మంది మరణించగా వారినందరినీ ఒకసారి గుర్తు చేసుకొని వారికి నివాళులర్పిoచారు. రిటైర్మెంట్ పొందిన వారు రిటైర్డ్ మెంట్ ముందు,తరువాత జరిగిన విషయాలను అందరితో పంచుకొని సరదాగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డు చిత్తూరు డివైఈఓ వాసుదేవ నాయుడు మాట్లాడుతూ…..మనం పనిచేసినపుడు వున్న భవనాలు, స్థలo కూడా లేదని ఈ స్థలంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడడo తో ఎందరో విద్యార్థులు ఇక్కడే చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదిగారన్నారు. ఈ పాఠశాలలో పనిచేసిన బదిలీ అయిన వారు రిటైర్డ్ అయినవారు ఈ కాంపౌండ్ లోకి కూడా రాక నేడు ఆత్మీయ సమావేశంలో కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకసారి మనల్ని ఆదరించిన ఇక్కడి స్థలాన్ని సందర్శిoచడంతో జన్మసార్ధక మయ్యిందన్నారు. మరో సారి ఇక్కడ కలసి మంచి కార్యక్రమo నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.చివర సన్మానాలు జరుపుకొని భోజన కార్యక్రమముతో ముగించారు. ఇందులో గంగవరం యాదమరి మండల విద్యాశాఖ అధికారులు వేణుగోపాల్ రెడ్డి, రుక్మిణమ్మ,సీనియర్ రిటైర్డ్ ఉపాద్యాయులు రంగారెడ్డి, రిటైర్డు ఉపాన్యాసకులు సుధాకర పిళ్ళై,ఈశ్వర్ రెడ్డప్ప,గుణశేఖర్,రిటైర్డ్ ఎంఈఓ వెంకటరమణ,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆదెమ్మ, వసుoధర,రామేశం,కేశవ పిళ్ళై,దుర్గాంబలతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులు నారాయణ బాబు,హరిప్రసాద్,వెంకట్రామయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక
!)ఆదరించిన స్థలాన్ని మరువం
!!)రిటైర్డ్ చిత్తూరు డీవైఈఓ వాసు

వృత్తిపరంగా పనిచేసినా ఆదరించిన స్థలాన్ని తాము ఎప్పటికీ మరువమని చిత్తూరు రిటైర్డు డివైఈఓ వాసుదేవ నాయుడు అన్నారు.స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ నందు 1990 – 2000 దశకములో పనిచేసిన ఉపాధ్యాయులు,ఉపన్యాసకులు ఆఫీస్ సిబ్బంది కలసి శనివారం ఆత్మీయ సమావేశం ఆ పాఠశాలలో నిర్వహించు కొన్నారు.అందరం కలసి ఒకరికొకరు యోగక్షేమాలు తెలిసికొని ఆ నాటి తీపిగుర్తులు నెమరు వేసుకొన్నారు.ఇందులో భాగంగా అప్పటి సహచరులు చాలా మంది మరణించగా వారినందరినీ ఒకసారి గుర్తు చేసుకొని వారికి నివాళులర్పిoచారు. రిటైర్మెంట్ పొందిన వారు రిటైర్డ్ మెంట్ ముందు,తరువాత జరిగిన విషయాలను అందరితో పంచుకొని సరదాగా చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా రిటైర్డు చిత్తూరు డివైఈఓ వాసుదేవ నాయుడు మాట్లాడుతూ…..మనం పనిచేసినపుడు వున్న భవనాలు, స్థలo కూడా లేదని ఈ స్థలంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడడo
తో ఎందరో విద్యార్థులు ఇక్కడే చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదిగారన్నారు. ఈ పాఠశాలలో పనిచేసిన బదిలీ అయిన వారు రిటైర్డ్ అయినవారు ఈ కాంపౌండ్ లోకి కూడా రాక నేడు ఆత్మీయ సమావేశంలో కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకసారి మనల్ని ఆదరించిన ఇక్కడి స్థలాన్ని సందర్శిoచడంతో జన్మసార్ధక మయ్యిందన్నారు. మరో సారి ఇక్కడ కలసి మంచి కార్యక్రమo నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.చివర సన్మానాలు జరుపుకొని భోజన కార్యక్రమముతో ముగించారు.
ఇందులో గంగవరం యాదమరి మండల విద్యాశాఖ అధికారులు వేణుగోపాల్ రెడ్డి, రుక్మిణమ్మ,సీనియర్ రిటైర్డ్ ఉపాద్యాయులు రంగారెడ్డి, రిటైర్డు ఉపాన్యాసకులు సుధాకర పిళ్ళై,ఈశ్వర్ రెడ్డప్ప,గుణశేఖర్,రిటైర్డ్ ఎంఈఓ వెంకటరమణ,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆదెమ్మ, వసుoధర,రామేశం,కేశవ పిళ్ళై,దుర్గాంబలతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులు నారాయణ బాబు,హరిప్రసాద్,వెంకట్రామయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.