ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. ఈ ఫైలింగ్ కు ఆఖరి తేదీ సెప్టెంబర్ 15వ తారీకు. ఈ క్రింది సూచనలు పాటించవలసినదిగా మనవి.
నూతన స్లాబ్ విధానంలో పన్ను చెల్లించిన వారు మీ ఇన్కమ్ టాక్స్ క్యాలిక్యులేషన్ షీట్ మొదటి పేజీని పంపించవలసి ఉంటుంది.
అదేవిధంగా నూతన టాక్స్ విధానాల్లో ఎటువంటి మినహాయింపులు లేవు కాబట్టి గత ఆర్థిక సంవత్సరంలో *అదనంగా పొందిన ఆదాయం మీద తప్పనిసరిగా ఇప్పుడు పన్ను చెల్లించవలసి ఉంటుంది.
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నందు జమకాబడిన వడ్డీ మరియు ఇన్కమ్ టాక్స్ రిఫండ్ పొందడం వలన అదనంగా వచ్చిన వడ్డీ మరియు ఇతర ఆదాయాలు పై E ఫైలింగ్ చేసేటప్పుడు పన్ను కట్టవలసి ఉంటుంది. గమనించగలరు.


