కామారెడ్డి,23 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా మెరుగైన ఉపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్ళిన కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండ లం, చుక్కాపూర్ గ్రామానికి చెందిన కావటి చిన్న ఎల్లయ్య (46) గుండెపోటుతో మరణించాడు. గత ఏడాది నుంచి తెలంగాణలో సరైన ఉపాధి అవకా శాలు లేకపోవడంతో, కూలీ పని కోసం ఎల్లయ్య బహ్రెయిన్ వెళ్ళాడు. బహ్రెయిన్‌లోని ఒక ఎస్టీఎస్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్న ఎల్లయ్య, అక్కడ అదృష్టం కలిసిరాలేదు, తీవ్ర మనోవేదనకు గుర య్యాడు.సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చలే కపోతున్నానని తరచుగా తన సహచరులతో చెప్పుకుని బాధపడేవాడని ఎన్నారై వెంకటస్వామి తెలిపారు.ఈనేపథ్యంలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని భావిస్తున్నారు.మృతదేహం స్వదేశానికి పంపించేందుకు ఎన్నారైల సహకారం..ఎల్లయ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు బహ్రె యిన్‌లోని ప్రవాస భారతీయుల సంఘం (ఎన్నారై ల సంఘం) సహాయపడింది. మృతదేహాన్ని హైదా రాబాద్‌కు పంపించే ఏర్పాట్లు వారు చేశారు. ఈ సంఘటనపై ఎన్నారై వెంకటస్వామి స్పందిస్తూ, నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లయ్య మృతి బాధాకరమన్నారు.వెంటనే బాదీత కుటుబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిందని గుర్తు చేస్తూ, ఈ నిబంధనల కింద ఎల్లయ్య కుటుంబా నికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు..


