వెల్దండ,అక్టోబర్ 11, : వెల్దండ మండలం లోని ఉపాధి హామీ కూలీలందరూ ఆధార్ ఈ -కేవైసీ ని తప్పనిసరిగా సాఫ్ట్ వేర్ లో అప్లోడ్ చేసుకోవాలని ఎంపీడీవో లక్ష్మణ్ నాయక్, ఏపీవో ఈశ్వర్ జీ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. వివిధ గ్రామాలలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం ,సాయంత్రం వేళల్లో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఈకేవైసీ ని పూర్తి చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పై తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
Video: https://punnami.in/Telangana


