విజయవాడ,జూలై 25 ( పున్నమి ప్రతినిధి) :
ఏ.పీ.రాష్ట్రంలోని ఉపాద్యాయుల, ఏంటిఎస్ ఉపాద్యాయులు – 1998,2008 ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పట్ల తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ ని క్యాంపు కార్యాలయం నందు,మాజీ శాసనమండలి సభ్యులు టి.డి జనార్దన్ ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయప్రకాష్ నాయుడు, చందనం రామయ్యలు కలసి… 2003 DSC ఉపాధ్యాయులకు మెమో 57ను అమలుపరచి పాత పెన్షన్ వర్తింపజేయాలని, బదిలీ పొంది రిలీవ్ కానీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, నూతనంగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు , కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ఎంటిఎస్ ఉపాధ్యాయులకు ప్రతినెల జీతాలు చెల్లించాలని, అదేవిధంగా వారి పదవీ విరమణ వయస్సు ను 62 సంవత్సరాలకు పెంచాలని, ప్లస్ టు కాలేజీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, నెలవారి పదోన్నతులు చేపట్టాలని తదితర పలు ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగిoది. ఈ సందర్భంగా ఏంఎల్సిలు మాట్లాడుతూ…. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సంఘ నాయకులు ప్రాతినిధ్యం చేసిన ప్రతి సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో వీలైనంత త్వరగా చర్చించి పరిష్కారమునకు కృషి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని ఎన్టీఏ నాయకులు తెలియజేశారు.