నంద్యాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ‘రండి… టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం గురువారం నంద్యాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ ఆగస్టు 5న ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నదన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోగా, సమస్యలు చెబితే వారిని ద్రోహులుగా ముద్రవేశాయని విమర్శించారు. ఇప్పుడు ఏడాది దాటినా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులపై సుమారు ₹35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఖాళీ ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే, ప్రభుత్వం బకాయిలు తీర్చడమే కాక ఉద్యోగులకు గృహ కల నెరవేరుతుందని సూచించారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ చర్చలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతో కాకుండా, సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలనే లక్ష్యంతో జరుగుతున్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు నాలుగేళ్లుగా రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నరేంద్ర, సహాధ్యక్షుడు జమాలయ్య, కార్యనిర్వహణ కార్యదర్శి రాజశేఖర్, సభ్యులు రాజశేఖర్, సతీష్‌కుమార్ రెడ్డి, ఆరిఫ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కే నాగేంద్రప్ప