Sunday, 22 March 2026
  • Home  
  • ఉద్యోగుల సమస్యలపై గళమెత్తిన ఏపీఎన్జీజీవో సంఘం నాయకులు
- చిత్తూరు

ఉద్యోగుల సమస్యలపై గళమెత్తిన ఏపీఎన్జీజీవో సంఘం నాయకులు

పలమనేరు, జులై 27( పున్నమి ప్రతినిధి ) : ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి వీడి, చొరవగా పరిష్కార చర్యలు తీసుకోవాలని పలమనేరు ఏపీఎన్జీజీవో సంఘం అధ్యక్షుడు ఆనందబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తూరు ఎన్జీవో హోం నందు జిల్లా అధ్యక్షుడు రాఘవులు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పలమనేరు ఎన్జీఓ సంఘం తరపున ఈ అంశాలు ప్రస్తావించారు. కొత్త పీఆర్సీ కమీషన్ ఏర్పాటు,పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల విడుదల,సరెండర్ లీవుల చెల్లింపు, బకాయిల చెల్లింపులు,మధ్యంతర భృతి ప్రకటించడం,ఇటీవల జరిగిన బదిలీల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య శాఖలో చేపట్టిన బదిలీలలో అవినీతి, అక్రమాలు,సంఘాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఎన్జీఓ సంచారం మాస పత్రిక చందా దారుల పెంపు తదితర అంశాలపై చర్చించారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెంచలరావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గం జిల్లా లోని అన్ని తాలూకా ల నాయకులతో పాటు పలమనేరు నియోజకవర్గం తరఫున జిల్లా ఎన్జీజీఓ సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మీపతియాదవ్, కార్యదర్శి ఎం జయమ్మ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు, జులై 27( పున్నమి ప్రతినిధి ) : ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి వీడి, చొరవగా పరిష్కార చర్యలు తీసుకోవాలని పలమనేరు ఏపీఎన్జీజీవో సంఘం అధ్యక్షుడు ఆనందబాబు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తూరు ఎన్జీవో హోం నందు జిల్లా అధ్యక్షుడు రాఘవులు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పలమనేరు ఎన్జీఓ సంఘం తరపున ఈ అంశాలు ప్రస్తావించారు. కొత్త పీఆర్సీ కమీషన్ ఏర్పాటు,పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల విడుదల,సరెండర్ లీవుల చెల్లింపు, బకాయిల చెల్లింపులు,మధ్యంతర భృతి ప్రకటించడం,ఇటీవల జరిగిన బదిలీల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య శాఖలో చేపట్టిన బదిలీలలో అవినీతి, అక్రమాలు,సంఘాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఎన్జీఓ సంచారం మాస పత్రిక చందా దారుల పెంపు తదితర అంశాలపై చర్చించారు.
ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెంచలరావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గం జిల్లా లోని అన్ని తాలూకా ల నాయకులతో పాటు పలమనేరు నియోజకవర్గం తరఫున జిల్లా ఎన్జీజీఓ సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మీపతియాదవ్, కార్యదర్శి ఎం జయమ్మ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.