Wednesday, 25 March 2026
  • Home  
  • ఉద్యోగుల సమస్యలపై ఆగస్టు 5వ తేదీన *రండి “టి” త్రాగుతూ మాట్లాడుకుందాం*
- E-పేపర్

ఉద్యోగుల సమస్యలపై ఆగస్టు 5వ తేదీన *రండి “టి” త్రాగుతూ మాట్లాడుకుందాం*

ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల ఆగస్టు 5వ తేదీన నంద్యాల జిల్లాలో “రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం” అని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యకులు నాగేంద్రప్ప తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్య నారాయణ గారు ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగులకు రావలసిన ఆర్ధిక బకాయిలపై ఉద్యోగులతో “టీ” త్రాగుతూ చర్చించడం జరుగుతుందన్నారు. మూడు నెలల కాలంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు రావలసిన బకాయిలు సుమారు 35 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు మరియు దాదాపుగా 27 రకాల సమస్యలను ‘రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమం ద్వారా రాబోయే మూడు నెలల పాటు జిల్లాలోనీ అన్ని తాలూకా లలో వివిధ శాఖల పరిధిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అనే విషయం పై ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా, తాలూకా కార్యవర్గ సభ్యులకు సూచించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యలపై ఈ చర్చా వేదికల్లో చర్చించి రాష్ట్ర సంఘం ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్ ని సభ్యులు సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ తాలూకా వ్యవసాయ శాఖ ఏ డి ఏ విజయశేఖర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప, జిల్లా కార్యదర్శి శ్రీ తిరుపాలయ్య, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, సహా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షులు సునీల్ కుమార్, ఫక్రుద్దీన్, విజయలక్ష్మి, సిటీ అధ్యక్షులు సత్యం, సహా అధ్యక్షులు వెంకట శివన్న కోశాధికారి వెంకట చక్రదర్, ఉపాధ్యక్షులు యేసురత్నం జిల్లా లోని ఆత్మకూరు అధ్యక్షులు మస్తానయ్య, కోశాధికారి వెంకట రమణయ్య, నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు నర్సరాజు, కార్యదర్శి భువనేశ్వరి, ఉపాధ్యక్షులు మద్దిలేటి, డోన్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్, ఆళ్ల గడ్డ తాలూకా కార్యదర్శి హాజరయ్య, సహా అధ్యక్షులు నాగరాజు, బనగానపల్లి తాలూకా కార్యదర్శి చంద్రశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల ఆగస్టు 5వ తేదీన నంద్యాల జిల్లాలో “రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం” అని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యకులు నాగేంద్రప్ప తెలిపారు.

స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్య నారాయణ గారు ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగులకు రావలసిన ఆర్ధిక బకాయిలపై ఉద్యోగులతో “టీ” త్రాగుతూ చర్చించడం జరుగుతుందన్నారు. మూడు నెలల కాలంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు రావలసిన బకాయిలు సుమారు 35 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు మరియు దాదాపుగా 27 రకాల సమస్యలను ‘రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమం ద్వారా రాబోయే మూడు నెలల పాటు జిల్లాలోనీ అన్ని తాలూకా లలో వివిధ శాఖల పరిధిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అనే విషయం పై ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా, తాలూకా కార్యవర్గ సభ్యులకు సూచించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యలపై ఈ చర్చా వేదికల్లో చర్చించి రాష్ట్ర సంఘం ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్ ని సభ్యులు సన్మానించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ తాలూకా వ్యవసాయ శాఖ ఏ డి ఏ విజయశేఖర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప, జిల్లా కార్యదర్శి శ్రీ తిరుపాలయ్య, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, సహా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షులు సునీల్ కుమార్, ఫక్రుద్దీన్, విజయలక్ష్మి, సిటీ అధ్యక్షులు సత్యం, సహా అధ్యక్షులు వెంకట శివన్న కోశాధికారి వెంకట చక్రదర్, ఉపాధ్యక్షులు యేసురత్నం జిల్లా లోని ఆత్మకూరు అధ్యక్షులు మస్తానయ్య, కోశాధికారి వెంకట రమణయ్య, నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు నర్సరాజు, కార్యదర్శి భువనేశ్వరి, ఉపాధ్యక్షులు మద్దిలేటి, డోన్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్, ఆళ్ల గడ్డ తాలూకా కార్యదర్శి హాజరయ్య, సహా అధ్యక్షులు నాగరాజు, బనగానపల్లి తాలూకా కార్యదర్శి చంద్రశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.