రాజకీయరంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలని సురేష్ గారిని ఆశీర్వదించిన ముఖ్యమంత్రివర్యులు”
సమాజానికి అంకితభావం తో సేవలందిస్తున్న కాకర్ల సురేష్ గారిపై సీఎం ప్రశంసలు”
అమరావతి, సెప్టెంబర్ 19 :(పున్నమి న్యూస్):///
ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి వారి ఆశీస్సులను అందుకున్నారు,ముఖ్యమంత్రి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,“ప్రజా సేవలో అంకితభావంతో, అభివృద్ధి పట్ల కట్టుబాటుతో, సమాజంలోని ప్రతి వర్గాన్ని సమానంగా ఆదరిస్తూ, రాజకీయ రంగంలో విశేష కృషి చేస్తున్న కాకర్ల సురేష్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆశీర్వదించారు.ఉదయగిరి ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండి, సేవా తత్పరతతో నిలిచిన సురేష్ గారు రాజకీయరంగంలో శిఖరాగ్ర స్థానాలను అధిరోహించాలని ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షించారు.


