Story highlights
- ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి మండలంలో బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
- ప్రచారంలో భాగంగా మాసాయిపేట, ఎస్వీ చింతల, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.
- బీఎస్పీ ఆశయాలు, ప్రజల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.
ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి మండలంలో బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మాసాయిపేట, ఎస్వీ చింతల, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. బీఎస్పీ ఆశయాలు, ప్రజల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ పార్టీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి మద్దతు కోరారు.