అందరికీ జై భీమ్ నినాదాలతో ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం తూర్పుపాలెం, సాయిపేట తదితర గ్రామాలలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో “గడప గడపకు బీఎస్పీ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్, నియోజకవర్గ ఇన్‌చార్జి క్రాకుటురు పుష్పాంజలి ప్రజలను కలుసుకుని పార్టీ సిద్ధాంతాలను వివరించారు. నియోజకవర్గ కన్వీనర్ బెజవాడ ప్రకాశరావు సహా సంకే మల్లిఖార్జున, మదన్, మంద నాగేశ్వరరావు, కే. సురేష్, అభినాష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.



