Thursday, 5 February 2026
  • Home  
  • *ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి అన్నదానం ప్రారంభించిన ఎంపీ.*
- E-పేపర్

*ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి అన్నదానం ప్రారంభించిన ఎంపీ.*

విజయవాడ, సెప్టెంబర్ 30 : పున్నమి ప్రతినిధి సురేష్ విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో శ్రీ సత్యనారాయణ స్వామి కూరగాయాల చిల్లర వర్తక సంఘం మరియు వర్తక సంఘాల ఐక్యత కమిటి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం కనకదుర్గాదేవి అలంకరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎంపీ కేశినేని శివనాథ్ కు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గజమాలతో సత్కరించి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి మైలవరపు కృష్ణ, ఉపాధ్యక్షుడు ఆకుల రాజు, కోశాధికారి ఏ.గంగాధర్, పైడి కృష్ణ, ఎల్.అప్పారావు, ఎస్.తారక రామ్, మాత శివ, ఆకుల శ్రీను, అల్లం గణేష్, కోలా శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ, సెప్టెంబర్ 30 : పున్నమి ప్రతినిధి సురేష్

విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో శ్రీ సత్యనారాయణ స్వామి కూరగాయాల చిల్లర వర్తక సంఘం మరియు వర్తక సంఘాల ఐక్యత కమిటి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం కనకదుర్గాదేవి అలంకరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎంపీ కేశినేని శివనాథ్ కు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గజమాలతో సత్కరించి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ అన్నదానం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి మైలవరపు కృష్ణ, ఉపాధ్యక్షుడు ఆకుల రాజు, కోశాధికారి ఏ.గంగాధర్, పైడి కృష్ణ, ఎల్.అప్పారావు, ఎస్.తారక రామ్, మాత శివ, ఆకుల శ్రీను, అల్లం గణేష్, కోలా శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.