ఉత్పత్తితో వేతనాలు ముడిపెడితే ప్రతిఘటిస్తాం
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తితో వేతనాలు ముడిపెడుతూ ఇచ్చిన సర్కులర్ ను రద్దు చేయాలని లేకుంటే ప్రతిఘటిస్తామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ నేడు స్టీల్ కార్మికులు పొందుతున్న వేతనాలు యాజమాన్యం ప్రభుత్వాలు దయాదాక్షణ్యాలతో ఇచ్చినవి కాదని ఆయన అన్నారు. కార్మికులపై ప్రభుత్వ దాడి,యాజమాన్య నిరంకుశత్వానికి పరాకాష్ట వేతనం పై దాడి అని ఆయన వివరించారు. గత సంవత్సర కాలంగా పూర్తి వేతనాలు చెల్లించకుండా కార్మికులను అర్ధాకలితో పస్తులు పెడుతూ ఉన్నారని ఆయన అన్నారు. కార్మికుల హక్కుగా ఉన్న హెచ్ ఆర్ ఎ వాయిదా వేసి సుమారు 6000 మందిని, ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు చార్జీలు పెంచి ఆర్థికంగా నష్టపరిచారని ఆయన వివరించారు. పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని యాజమాన్యాన్ని కార్మికులు కోరుతుంటే దానికి విరుద్ధంగా నేడు యాజమాన్యం చట్ట విరుద్ధమైన, దుర్మార్గమైన సర్కులర్ ను విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఐ ఎన్ టి యు సి జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉత్పత్తి హెచ్చుతగ్గులకు ఉద్యోగులు బాధ్యులు కాదని, ప్రణాళికలు రూపొందించేది అమలు చేసేది ప్రభుత్వ, ఉన్నత యాజమాన్యాలే అని ఆయన అన్నారు. ప్లాంటులో యంత్రాలు పాతవి అయిపోయాయని వాటి మరమ్మత్తులు సకాలంలో చేయలేదని, రా మెటీరియల్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని ఈ పరిస్థితుల నడుమ పూర్తిస్థాయి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. అధికారులు చెబుతున్న వినకుండా ఇన్చార్జి సిఎండి ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ ఉత్పత్తి పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన వివరించారు. ఏమాత్రం ప్రణాళిక లేకుండా నియంతలా ఉద్యోగులను తొలగించి కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను వీధులు పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రా మెటీరియల్ అందుబాటులో లేని కారణంగానే అధిక ధరకు కోక్ మరియు పెలెట్స్ కొనుగోలు చేస్తున్నారని వీటి నాణ్యత లేని కారణంగానే స్టీల్ తిరస్కరణకు గురి అయిందని ఆయన అన్నారు. యాజమాన్యం తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని లేకుంటే ఐక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఎ టి యు సి ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ గడచిన 4 సంవత్సరాలుగా కార్మికుల హక్కులను ఈ యాజమాన్యం కాలరాసోంతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన తాబేదారులకు ఈ ప్లాంట్ ను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని నేడు రాష్ట్రంలోని ప్రభుత్వం మద్దతు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు. అందులో భాగంగానే జరుగుతున్న పరిణామాలను కార్మిక వర్గం ఐక్యంగా త్రిప్పికొడుతూ ఉద్యమించాలని మరింత ఉధృతం చేస్తామని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు.
సిఐటియు జిల్లా నాయకులు ఎం రామారావు, స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె అయోధ్య రామ్, రమణమూర్తి, డివి రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, సిహెచ్ సన్యాసిరావు, పాడి త్రినాథ్, శ్రీనివాస్, సంపూర్ణం తదితరులు మాట్లాడుతూ ఉన్నత యాజమాన్యం చేతకాన్నితనాన్ని అధికారుల, ఉద్యోగులపై నెట్టి, ప్రశ్నించిన అధికారులను సస్పెండ్, ట్రాన్స్ఫర్ చేస్తూ షో కాజు నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. ప్లాంట్ లో స్ట్రక్చర్స్ అన్నీ కుప్పకూలిపోయే విధంగా ఉన్న కనీసం మెయింటెనెన్స్ చేయకుండా ప్లాంటును అధోగదిపాలు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉన్నత యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. అవమానాలు భరిస్తూ, భద్రత లేక ప్రాణాలు కోల్పోతున్నా, పని భారం పెరిగిన మనోధైర్యాన్ని కోల్పోకుండా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే భావితరాలకు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల యాజమాన్యం తన పద్ధతిని మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకోవడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, కె ఎస్ ఎన్ రావు, బి యన్ రాజు, గణపతి రెడ్డి, పరంధామయ్య, డేవిడ్, జి ఆర్ కె నాయుడు, నీరుకొండ రామచంద్రరావు, టి వి కె రాజు, బి అప్పారావు, బి తౌడన్న తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు,నూతన కార్మికులు, రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో వివిధ సంఘాల కార్యకర్తలు మరియు కార్మికులు పాల్గొన్నారు.

ఉత్పత్తితో వేతనాలు ముడిపెడితే ప్రతిఘటిస్తాం
ఉత్పత్తితో వేతనాలు ముడిపెడితే ప్రతిఘటిస్తాం *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తితో వేతనాలు ముడిపెడుతూ ఇచ్చిన సర్కులర్ ను రద్దు చేయాలని లేకుంటే ప్రతిఘటిస్తామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ నేడు స్టీల్ కార్మికులు పొందుతున్న వేతనాలు యాజమాన్యం ప్రభుత్వాలు దయాదాక్షణ్యాలతో ఇచ్చినవి కాదని ఆయన అన్నారు. కార్మికులపై ప్రభుత్వ దాడి,యాజమాన్య నిరంకుశత్వానికి పరాకాష్ట వేతనం పై దాడి అని ఆయన వివరించారు. గత సంవత్సర కాలంగా పూర్తి వేతనాలు చెల్లించకుండా కార్మికులను అర్ధాకలితో పస్తులు పెడుతూ ఉన్నారని ఆయన అన్నారు. కార్మికుల హక్కుగా ఉన్న హెచ్ ఆర్ ఎ వాయిదా వేసి సుమారు 6000 మందిని, ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు చార్జీలు పెంచి ఆర్థికంగా నష్టపరిచారని ఆయన వివరించారు. పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని యాజమాన్యాన్ని కార్మికులు కోరుతుంటే దానికి విరుద్ధంగా నేడు యాజమాన్యం చట్ట విరుద్ధమైన, దుర్మార్గమైన సర్కులర్ ను విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఐ ఎన్ టి యు సి జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉత్పత్తి హెచ్చుతగ్గులకు ఉద్యోగులు బాధ్యులు కాదని, ప్రణాళికలు రూపొందించేది అమలు చేసేది ప్రభుత్వ, ఉన్నత యాజమాన్యాలే అని ఆయన అన్నారు. ప్లాంటులో యంత్రాలు పాతవి అయిపోయాయని వాటి మరమ్మత్తులు సకాలంలో చేయలేదని, రా మెటీరియల్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని ఈ పరిస్థితుల నడుమ పూర్తిస్థాయి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. అధికారులు చెబుతున్న వినకుండా ఇన్చార్జి సిఎండి ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ ఉత్పత్తి పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన వివరించారు. ఏమాత్రం ప్రణాళిక లేకుండా నియంతలా ఉద్యోగులను తొలగించి కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను వీధులు పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రా మెటీరియల్ అందుబాటులో లేని కారణంగానే అధిక ధరకు కోక్ మరియు పెలెట్స్ కొనుగోలు చేస్తున్నారని వీటి నాణ్యత లేని కారణంగానే స్టీల్ తిరస్కరణకు గురి అయిందని ఆయన అన్నారు. యాజమాన్యం తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని లేకుంటే ఐక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎ టి యు సి ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ గడచిన 4 సంవత్సరాలుగా కార్మికుల హక్కులను ఈ యాజమాన్యం కాలరాసోంతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన తాబేదారులకు ఈ ప్లాంట్ ను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని నేడు రాష్ట్రంలోని ప్రభుత్వం మద్దతు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు. అందులో భాగంగానే జరుగుతున్న పరిణామాలను కార్మిక వర్గం ఐక్యంగా త్రిప్పికొడుతూ ఉద్యమించాలని మరింత ఉధృతం చేస్తామని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం రామారావు, స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె అయోధ్య రామ్, రమణమూర్తి, డివి రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, సిహెచ్ సన్యాసిరావు, పాడి త్రినాథ్, శ్రీనివాస్, సంపూర్ణం తదితరులు మాట్లాడుతూ ఉన్నత యాజమాన్యం చేతకాన్నితనాన్ని అధికారుల, ఉద్యోగులపై నెట్టి, ప్రశ్నించిన అధికారులను సస్పెండ్, ట్రాన్స్ఫర్ చేస్తూ షో కాజు నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. ప్లాంట్ లో స్ట్రక్చర్స్ అన్నీ కుప్పకూలిపోయే విధంగా ఉన్న కనీసం మెయింటెనెన్స్ చేయకుండా ప్లాంటును అధోగదిపాలు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉన్నత యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. అవమానాలు భరిస్తూ, భద్రత లేక ప్రాణాలు కోల్పోతున్నా, పని భారం పెరిగిన మనోధైర్యాన్ని కోల్పోకుండా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే భావితరాలకు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల యాజమాన్యం తన పద్ధతిని మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకోవడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, కె ఎస్ ఎన్ రావు, బి యన్ రాజు, గణపతి రెడ్డి, పరంధామయ్య, డేవిడ్, జి ఆర్ కె నాయుడు, నీరుకొండ రామచంద్రరావు, టి వి కె రాజు, బి అప్పారావు, బి తౌడన్న తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు,నూతన కార్మికులు, రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో వివిధ సంఘాల కార్యకర్తలు మరియు కార్మికులు పాల్గొన్నారు.

