ఉత్తర నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు గారు, మంతా తుఫాన్ కారణంగా చోటుచేసుకున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
తుఫాన్ ప్రభావంతో ఉత్తర నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో చెట్లు విరిగిపడడం, కొండవాలు ప్రాంతంలో జారిపడడం, మాధవధార వాంబే కాలనీలో ఇళ్లు పెచ్చులు ఊడిపడడం ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ కలెక్టర్ మాధురి గారు, స్థానిక కార్పొరేటర్ లు రేయి వెంకట రమణ, కట్టుమూరి సతీష్ గారు, సారిపల్లి గోవింద్ గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ గారు, సురేష్ బాబు గారు, ఉషా కిరణ్ గారు, మండల మరియు వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ,
చెట్లను త్వరితగతిన తొలగించాలి,
ప్రమాదకర ఇళ్లను ఖాళీ చేయించి రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించాలి,
గురుద్వార్ సమీపంలో హైవే కుంగిన ప్రాంతంలో ట్రాఫిక్ స్టాపర్ ఏర్పాటు చేసి, వెంటనే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని పోలీసు మరియు ట్రాఫిక్ అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యే గారు ప్రజల భద్రతే ప్రాధాన్యమని పేర్కొని, ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయక చర్యలు తక్షణమే ప్రారంభించబడతాయని తెలిపారు.


