Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ

Punnami Newsroom Published:
ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ

Story highlights

  • ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన లోగోను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సోమవారం ఆవిష్కరించారు.
  • ఉత్తరాంధ్ర ప్రాంతంలోని జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ఈ అసోసియేషన్ అధికారిక లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ సమాజంలో పత్రికారంగం, మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన లోగోను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సోమవారం ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ఈ అసోసియేషన్ అధికారిక లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ సమాజంలో పత్రికారంగం, మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ముఖ్య సలహాదారులు, కార్యవర్గ సభ్యులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *