ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

ఉత్తమ రీడర్లకు విద్యుత్ శాఖలో ఘన సత్కారం*

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
ఉత్తమ రీడర్లకు విద్యుత్ శాఖలో ఘన సత్కారం*

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • *సూళ్లూరుపేట, ఆగస్టు 13 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన రీడర్లను ఘనంగా సత్కరించారు.
  • వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, విద్యుత్ బిల్లుల రీడింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రీడర్ల సేవలను గుర్తించి వారికి షీల్డ్లను బహూకరించారు.
  • ఏఈ శేఖర్, జేఏఓ మనయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రీడర్లను అభినందించారు.

*సూళ్లూరుపేట, ఆగస్టు 13

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన రీడర్లను ఘనంగా సత్కరించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, విద్యుత్ బిల్లుల రీడింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రీడర్ల సేవలను గుర్తించి వారికి షీల్డ్లను బహూకరించారు.
ఏఈ శేఖర్, జేఏఓ మనయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రీడర్లను అభినందించారు. విద్యుత్ శాఖలో రీడర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి నెలా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడంతో పాటు బిల్లింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖకు వినియోగదారులకు మధ్య రీడర్లు కీలక వారధిగా పనిచేస్తున్నారని, ఎండ, వర్షం వంటి ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని కార్యక్రమంలో ప్రశంసించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన పనితీరును కనబరిచిన సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఉత్తమ సేవలకు గుర్తింపుగా షీల్డ్లు అందుకోవడం రీడర్లలో ఆనందాన్ని కలిగించింది. తమ సేవలను గుర్తించి ప్రోత్సహించిన విద్యుత్ శాఖ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ స్థాయి ఏఈలు, జేఈలు, లైన్మెన్లు, రీడర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *