ఖమ్మం నవంబర్
(పున్నమి ప్రతి నిధి)
శ్రీ రాజసాయి మందిరం, వి.యం. బంజర వారి ఆధ్వర్యంలో శ్రీమతి విజయనర్సింహా రెడ్డి జ్ఞాపకార్ధం మమత మెడికల్ కాలేజ్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ని నవంబర్ 8, 2025న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడనుంది అని
నీలపు ఉమా సుబ్రహ్మణ్యం రెడ్డి తెలియజేశారు
ఈ శిబిరం జె.డి.పి.హెచ్.ఎస్. స్కూల్, వి.యం. బంజర, పెనుబల్లి మండలం లో జరగనుందని
అర్హత కలిగిన కంటి రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి ఉచిత కంటి ఆపరేషన్‌లు కూడా చేయబడతాయని
శిబిరంలో కంటి నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహించనున్నారని
ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు


