ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):
పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రముఖ నాయకులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.
అలాగే కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, వరంగల్ జిల్లా ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఉగాది పర్వదినం కొత్త ప్రారంభాలకు ప్రతీకగా నిలుస్తుందని, రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి, సుభిక్షతలు నెలకొనాలని ఆకాంక్షించారు


