ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆలయ ధర్మకర్త పుష్ప మునిరామ్ రెడ్డి
పున్నమి ప్రతినిధి మార్చి 19 తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలం శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి ఆలయంలో గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ విజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది.MRR ట్రస్టు వారి శ్రీ విజయ గణపతి స్వామి వారికి పాలు పెరుగు తేనె నెయ్యి పన్నీరు విభూది చందన తదితర సుగంధ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు మధు స్వామి అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్ప మునిరామ్ రెడ్డి దంపతులు,కుటుంబ సభ్యులకు ,స్థానికులకు,గోత్ర నామాలతో అర్చన చేసి విజయ ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ,స్వామి వారి తీర్థ ప్రసాదాలు,ఉగాది పచ్చడి అందేశారు.ప్రధాని ,ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ప్రజలకు మంచి పాలన అందించాలని,పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ విశేషాన్ని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పుష్ప మునిరామ్ మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో శ్రీ విజయ గణపతి ఆశీస్సులతో అందరూ బాగుండాలి అని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



