ఉక్కు లో ముగిసిన అధికారుల సంఘం ఎన్నికలు
స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, జనవరి 21, (పున్నమి ప్రతినిధి).
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మంగళవారం జరిగిన అధికారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మధ్యాహ్నం 12.30 నుంచి 03.30 వరకు మొదటి విడత, తిరిగి సాయంత్రం 05.30 నుండి 08.30 వరకు రెండవ విడత పోలింగ్ నిర్వహించారు. మొత్తం 2350 ఓట్లకు గాను పోస్టల్ బ్యాలెట్ తో కలపి 1588 ఓట్లు పొలయ్యాయి. అనంతరం జరిగిన లెక్కింపు జరిగింది. అధ్యక్షుడు గా యమ్.యమ్.ఎస్.ఎమ్. డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ ఎస్. విద్యుత్ కుమార్ వర్మ, జనరల్ సెక్రటరీ గా క్యూఏటిడి డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ కె.వి.డి. ప్రసాద్ , వైస్ ప్రెసిడెంట్ గా వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మేనేజర్ బి.పి. శ్రీకాంత్ కళ్యాణ్ , జాయిన్ సెక్రటరీ గా ఎల్.ఎమ్. ఎమ్. ఎమ్. డిపార్ట్మెంట్ మేనేజర్ ఎమ్.సత్యనారాయణ ఎన్నికయ్యారు.


