పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు దేశ ఐక్యతకు ప్రతీక అయిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజ్యసభ సెంట్రల్ హాల్లో ప్రసంగించిన మడుతూరి గాన ప్రియను పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సత్కరించారు.
గత అక్టోబర్ 31న దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్యసభ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న మడుతూరి గాన ప్రియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గొప్పతనం, దేశ ఐక్యతకు ఆయన చేసిన కృషి గురించి ప్రసంగించి అందరి ప్రశంసలు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆమెకు సాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. యువతిలో దేశభక్తి, సేవా భావం పెంపొందించడం అవసరమని, గాన ప్రియా వంటి ప్రతిభావంతులైన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గొల్లవిల్లి రమణ, కంచిపాటి మధు, మడక బంగార్రాజు, గన్రెడ్డి రమేష్ తదితర నాయకులు, ఉమ్మడి ఎన్‌డిఏ మహాకూటమి కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


