ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్: WHO
భారత్లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్లను వాడొద్దని WHO హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా ‘కోల్డిఫ్’ కూడా ఉంది. దాంతో పాటు రెడ్నేక్స్ ఫార్మా ‘రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా ‘రీలైఫ్’ సిరప్లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.


