ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ :
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశం ద్వారా ఆయన పార్టీ కార్యకర్తలకు రాబోయే రోజుల పార్టీ కార్యక్రమాల, కూటమి స్ఫూర్తి, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తారు.ఈ వేదికపై పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొని కార్యకర్తలకు సందేశం ఇవ్వనున్నారు. సమావేశంలో రాబోయే రోజుల్లో పార్టీ కార్యకలాపాలు, కూటమి స్ఫూర్తి, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి కీలక అంశాలపై వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు.జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో ఇచ్చిన ప్రెస్ మీట్‌లో, ఈ సమావేశం పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల రూపరేఖను స్ఫష్టంగా చూపిస్తూ, పార్టీ దిశలో సమన్వయాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న విషయం వెల్లడించారు.

ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటన! జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ : జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశం ద్వారా ఆయన పార్టీ కార్యకర్తలకు రాబోయే రోజుల పార్టీ కార్యక్రమాల, కూటమి స్ఫూర్తి, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తారు.ఈ వేదికపై పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొని కార్యకర్తలకు సందేశం ఇవ్వనున్నారు. సమావేశంలో రాబోయే రోజుల్లో పార్టీ కార్యకలాపాలు, కూటమి స్ఫూర్తి, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి కీలక అంశాలపై వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు.జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో ఇచ్చిన ప్రెస్ మీట్‌లో, ఈ సమావేశం పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల రూపరేఖను స్ఫష్టంగా చూపిస్తూ, పార్టీ దిశలో సమన్వయాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న విషయం వెల్లడించారు.

