అక్టోబర్ 27వ తేదీ సోమవారం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అర్జీదారులు తమ సమ స్యలను. టోల్ ఫ్రీ నంబర్ 1100 లేదా వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చునన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులు లేదా అభ్యర్థనలు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి స్వయంగా రావాల్సిన అవసరం లేదని, దీనికి బదులుగా టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని లేదా మీ కోసమే వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమస్యలు నమోదు చేసిన తర్వాత సంబంధిత శాఖాధికారులు వాటిని క్షేత్రస్థా యిలో విచారించి తగిన పరిష్కార చర్యలు తీసు కుంటారని, అర్జీదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలకు అనుగుణంగా తీర ప్రాంతంలో మరియు శిథిలావస్థకు చేరిన పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిఈఓను ఆదేశించారు.


