చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా చిట్వెల్ మండలంలోని కంవనముద్రం, కందులవారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు ఈ నెల 24న భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుంచి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాదం ఏర్పాట్లు ఉన్నాయని నిర్వాహకులు వివరించారు.


