పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.6000 సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ 21వ విడత (2025) విడుదల తేదీగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న ప్రకటించింది. ఈ విడత కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2000 నేరుగా జమ కానున్నాయి.
రైతులు తమ పేరు 21వ విడత లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చాలా సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని మీ పేరు లిస్ట్‌లో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, పేమెంట్ మీ ఖాతాలో జమ అయ్యిందా? పెండింగ్‌లో ఉందా? అనే విషయాలను కూడా స్టేటస్ చెక్ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు
🔍 పిఎం కిసాన్ 21వ విడత స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/pm-kisan-scheme


