విశాఖపట్నం, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి):
గాజువాక ప్రాంతానికి చెందిన యువ హీరో ప్రధాన పాత్రలో నటించిన ‘రోలుగుంట సూరి’ సినిమా ప్రెస్ మీట్ నిన్న గాజువాకలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హీరో మాట్లాడుతూ — “నేను గాజువాక ప్రాంతానికి చెందిన వాడిని. నా ఊరి ప్రజల ప్రేమ, ప్రోత్సాహం ఎప్పుడూ నాకు బలం. మా సినిమా రోలుగుంట సూరి లో మన ప్రాంతానికి చెందిన , మనుషుల జీవితం ప్రతిబింబిస్తుంది. అందరూ సినిమా థియేటర్‌కి వెళ్లి సపోర్ట్ చేయాలి” అని కోరారు.
దర్శకుడు మాట్లాడుతూ — “సూరి కథ ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం. రియలిస్టిక్ టచ్‌తో ప్రతి సీన్‌ను తీర్చిదిద్దాం. ఈ సినిమా యాక్షన్‌తో పాటు భావోద్వేగాల సమ్మేళనం అవుతుంది” అన్నారు.
నిర్మాతలు — “గాజువాకలోంచి వచ్చిన యువ హీరో ప్రతిభను పెద్ద స్థాయిలో చూపించాలన్న ఆలోచనతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం” అన్నారు.
సినిమా ట్రైలర్‌కి ఇప్పటికే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ రావడం, పాటలు మంచి స్పందన పొందడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.
‘రోలుగుంట సూరి’ — యాక్షన్, భావోద్వేగాలు, స్థానికత కలగలిసిన సినిమా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా ప్రజలందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని మూవీ టీం కోరారు.


