ఈరోజు ఉదయం అక్షర విద్యాలయం నందు తెలుగు భాషా దినోత్సవం మరియు స్పోర్ట్స్ డే నిర్వహించినారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించార. మొదటిగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ దేశభక్తి గీతం విద్యార్థులు ఆలపించినారు తదుపరి శ్రీకృష్ణదేవరాయల తెలుగు స్క్రిప్ట్ విద్యార్థులు చక్కగా అభినయించినారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రియా జాకబ్ గారు వైస్ ప్రిన్సిపల్ మంజుల గారు తెలుగు అధ్యాపకులు మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొని కార్యక్రమము జయప్రదం చేసినారు.end


