పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గయ్య
24/10/2025
ఈరోజు మాల్ వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పి బ్రహ్మయ్య సిఐటియు మండల కన్వీనర్ ఎస్ చందు నాయక్ హాజరై మాట్లాడుతూ* కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలు కాలంలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు ముందుకు తీసుకువస్తున్నారని అన్నారు. దశాబ్ద కాలం కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
మాల్ వ్యవసాయ మార్కెట్ లో హమాలీ కార్మికులకు కనీసం బాత్రూంలో లెట్ రూమ్ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా త్రాగడానికి నీళ్లు కూడా మార్కెట్ కమిటీ పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తక్షణమే హమాలి కార్మికులకు బాత్రూమ్ లెట్ రూమ్ సమస్యలను మరియు త్రాగడానికి మంచినీళ్లు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ప్రభుత్వం వర్తించే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హమాలి కార్మికులందరికీ గుర్తింపు కార్డులు, డ్రస్సులు పండుగ సందర్భంగా బోనస్ లాంటివి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి హమాలీ కార్మికులందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
అనంతరం మాల్ వ్యవసాయ మార్కెట్ హమాలి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
గౌరవ అధ్యక్షులుగా కాయితీ యాదగిరి రెడ్డి
అధ్యక్షులుగా బట్టు సత్యనారాయణ
ప్రధాన కార్యదర్శిగా రెడ్డ మోని నరసింహ
ఉపాధ్యక్షులుగా రెడ్డి మౌని మహేష్, సుజాత
సహాయ కారదర్శులుగా కాగు నరసింహ, అబ్బయ్య
కోశాధికారిగా గునుగంటి చిన్న జంగయ్య
సలహాదారులుగా ఉడుగుడ్ల రాములు
మొత్తం 41 మంది తోటి వ్యవసాయ హమాలి కార్మికుల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.


