ఇస్కాన్లో ప్రారంభమైన ఆధ్యాత్మిక మహా సమ్మేళనం.
*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి *
సనాతన ధర్మాన్ని , ఆధ్యాత్మిక జ్ఞానాన్ని హైందవ సాంప్రదాయాన్ని సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయడం, కృష్ణ చైతన్యాన్ని సంకీర్తన ఉద్యమాన్ని బోధించడం మరియు ప్రోత్సహించడమే ధ్యేయంగా కొనసాగుతున్న, ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థను నడిపిస్తున్న ఆధ్యాత్మిక గురువులైన సుమారు వందమంది మన ఇస్కాన్ సాగర్ నగర్ మందిరానికి నిన్న చేరుకున్నారు.
ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభానికి వచ్చి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి తీర్థప్రసాదాలను ఆశీర్వచనాన్ని అందరికీ అందజేశారు.
బ్యూరో చైర్మన్ శ్రీ భక్తి రసామృత స్వామి మహరాజ్, భాను స్వామి మహరాజ్, గౌరంగా ప్రభు, రేవతీ రామన్ ప్రభు, శ్రీ లోకనాథ్ స్వామి మహరాజ్, శ్రీ రాదేశాం ప్రభు ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు.
ఈరోజు జరిగిన సమావేశాల్లో భాగంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మారుమూల ప్రాంతాలకి ఏ విధంగా విస్తరింప చేయాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రతి ఇంట్లో భగవద్గీత మరియు భాగవతం ఉండేలా మరియు అందరికీ ఆ యొక్క జ్ఞానం అందించాలని ప్రభుపాదుల వారి ఆశయమని వారి యొక్క అడుగుజాడల్లో మనం ఆయన ఆశయాన్ని నిజం చేయాలని బ్యూరో చైర్మన్ శ్రీ భక్తి రసామృత స్వామి మహరాజ్ అన్నారు.
ఈ యొక్క సమావేశాలు ఈనెల 10 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు మందిర ఆవరణలో జరుగుతున్నాయి.


