– రెండు తులాల బంగారం దొంగిలించుకుని పారిపోయారు!
కామారెడ్డి, 23 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, ఇసన్నపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శివాలయ గుడి తాళం పగులగొట్టి, గుర్తు తెలియని అంటి దొంగలు రెండు తులం బంగారాన్ని దొంగిలిం చుకుని పారిపోయారు.భక్తుల భక్తి బిందు, గ్రామ వాసుల మనస్సును దెగ్గర చేసుకున్న ఈ పవిత్ర ఆలయంపై జరిగిన ఈ కుంఠీతనం అందరినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. రాత్రి సమయంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఆలయ పూజారి అబిలేష్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసు లు వెంటనే కేసు నమోదు చేసుకుని, దొంగలను పట్టుకోవడానికి తీవ్ర దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీ వీ ఫుటేజీలు, స్థానికుల సమాచారం, ఫింగర్ ప్రింట్ నమూనాలతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలు త్వరగా పట్టుబడి, దోచుకున్న బంగారు బంగారుగా తిరిగి ఆలయానికి చేర్చాలని గ్రామవాసులు, భక్తు లు కోరుకుంటున్నారు.ఈ ఘటన గ్రామంలో భయ భ్రాంతులు సృష్టించింది. ఆలయాలు, మహిళలు, పిల్లల భద్రతకు ఇది తీవ్ర ఆపనింద నిచ్చే సంకే తంగా మారింది. పోలీసులు త్వరలోనే దొంగలను పట్టుకుంటారని, న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.


